సింగిల్‌ సిట్టింగ్‌.. కుదిరేనా!

? డిగ్రీ చదివాను కానీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఇప్పుడు బీకాం పరీక్షలను సింగిల్‌ సిట్టింగ్‌లో రాద్దామనుకుంటున్నాను. కుదురుతుందా? ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు నాకు అర్హత ఉంటుందా?

Published : 04 Dec 2017 01:58 IST

 

సింగిల్‌ సిట్టింగ్‌.. కుదిరేనా! 

? డిగ్రీ చదివాను కానీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఇప్పుడు బీకాం పరీక్షలను సింగిల్‌ సిట్టింగ్‌లో రాద్దామనుకుంటున్నాను. కుదురుతుందా? ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు నాకు అర్హత ఉంటుందా?

- సునీల్‌కుమార్‌
జ: డిగ్రీలో మిగిలిన సబ్జెక్టులను పూర్తి చేయడానికి.. మీరు డిగ్రీ చదివిన కళాశాల లేదా అనుబంధ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించి, పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకోండి. ఇలా రాసి మీ డిగ్రీని పూర్తి చేయవచ్చు. ఈ విధంగా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లభించకపోవడం అంటూ ఉండదు. అలా కాకుండా మొత్తం బీకాం పరీక్షలను వేరే యూనివర్సిటీ ద్వారా వన్‌ సిట్టింగ్‌లో చేయాలనుకుంటేనే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, మీరు మిగిలిపోయిన మీ సబ్జెక్టులను చదివిన విద్యాలయం/ విశ్వవిద్యాలయం నుంచి రాసి, ఉత్తీర్ణులవ్వండి. తద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత సాధిస్తారు.

ఎథికల్‌ హ్యాకర్‌ కావాలనివుంది... 

? బీటెక్‌ (సీఎస్‌ఈ) తుది సంవత్సరం చదువుతున్నాను. ఎథికల్‌ హ్యాకింగ్‌ చదవాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను తెలియజేయండి.

- వీక్షణ్‌
  జ: హానికర హ్యాకర్లు చేయాలనుకునే దుశ్చర్యలను ముందుగానే పసిగట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టడమే ఎథికల్‌ హ్యాకర్స్‌ చేసే పని. ఒకరకంగా కంప్యూటర్‌, సహకార వ్యవస్థల బలహీనతలు, దుర్బలాలను గుర్తించే చర్యలను న్యాయపరంగా సాగించడమే వీరి ధ్యేయం. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంప్యూటర్‌ కోచింగ్‌ సంస్థలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణను అందిస్తున్నాయి. ఈసీ కౌన్సిల్‌వారు సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ (సీఈహెచ్‌) సర్టిఫికేషన్‌ కోర్సును అందిస్తున్నారు. ఇది ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సుల్లోనే ప్రముఖమైంది. ఈ పరీక్షలో 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి- నాలుగు గంటలు. మరిన్ని వివరాలకు www.eccouncil.org ను సందర్శించవచ్చు.
* ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని