సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా..

ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా నాకున్న అవకాశాలేంటి?

Published : 06 Dec 2017 01:55 IST

సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా..

ప్ర: ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌, లెక్చరర్‌ ఉద్యోగాలు మినహా నాకున్న అవకాశాలేంటి?

- టి. శిరీష

జ: మీ ప్రశ్నను చూస్తే మీకు ఇష్టంలేని రంగంలో చదువు కొనసాగించారేమో అనిపిస్తోంది. సాధారణంగా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటారు. వేరే వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి, మీరు బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రయత్నించవచ్చు. అలాగే, ఎస్‌ఎస్‌సీ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. నేర పరిశోధనపై ఆసక్తి, చాకచక్యం, సమయస్ఫూర్తి ఉంటే సీబీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సమాజసేవ పట్ల ఆసక్తి ఉంటే యూపీఎస్‌సీ పరీక్షలు రాసి, సివిల్స్‌ సాధించవచ్చు. వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే.. నలుగురికి ఉపాధిని కల్పించినవారూ అవుతారు. ముందుగా మీకు ఆసక్తి దేనిలో ఉందో ఆ రంగాన్ని ఎంచుకుని దానిలో నైపుణ్యాన్ని సాధించండి. ఉద్యోగావకాశాలు వాటంతటవే కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని