న్యూస్‌ రిపోర్టర్‌ అయ్యేదెలా?

డిగ్రీ పూర్తిచేశాను. వార్తా విలేఖరి (న్యూస్‌ రిపోర్టర్‌) కావాలనుంది. ఈ కోర్సును అందించే సంస్థలు, అర్హతల వివరాలను తెలియజేయండి. దూరవిద్య ద్వారా చేయడం సాధ్యమేనా?

Published : 01 Jan 2018 02:00 IST

న్యూస్‌ రిపోర్టర్‌ అయ్యేదెలా?

* డిగ్రీ పూర్తిచేశాను. వార్తా విలేఖరి (న్యూస్‌ రిపోర్టర్‌) కావాలనుంది. ఈ కోర్సును అందించే సంస్థలు, అర్హతల వివరాలను తెలియజేయండి. దూరవిద్య ద్వారా చేయడం సాధ్యమేనా?

- ఎల్‌. జీవన్‌, హన్మకొండ

జ: న్యూస్‌ రిపోర్టర్‌గా స్థిరపడాలనుకునేవారు జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో కోర్సు చేస్తే మేలు. విలేఖరి కావాలనుకునేవారు సామాజిక సమస్యలపట్ల అవగాహన, వర్తమాన వ్యవహారాలను తెలుసుకోవడంపట్ల ఆసక్తి, భావాన్ని నేర్పుతో ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో అందించే నైపుణ్యం ఉండాలి. భాష, పదాలపై పట్టు పెంచుకోవాలి.

రిపోర్టింగ్‌ వివిధ విభాగాలైన క్రైమ్‌, ఇన్వెస్టిగేటివ్‌ రిసెర్చ్‌, బిజినెస్‌, అంతర్జాతీయ, ప్రాంతీయ, క్రీడా వంటి విభాగాల్లో చేయవచ్చు. దూరవిద్యలో ఇగ్నో ‘మాస్టర్స్‌ ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌’, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ఎంఏ- జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌’ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని చదవడానికి డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.

* ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని