యునానీలో ప్రవేశం ఎలా?

* మా అమ్మాయి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. బీయూఎంఎస్‌ చేయించాలని కోరిక. అర్హత వివరాలను తెలియజేయండి. రెగ్యులర్‌ చదువుతోపాటు ఉర్దూనూ దూరవిద్య ద్వారా చేయడం కుదురుతుందా?

Published : 19 Feb 2018 01:45 IST

యునానీలో ప్రవేశం ఎలా?

* మా అమ్మాయి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. బీయూఎంఎస్‌ చేయించాలని కోరిక. అర్హత వివరాలను తెలియజేయండి. రెగ్యులర్‌ చదువుతోపాటు ఉర్దూనూ దూరవిద్య ద్వారా చేయడం కుదురుతుందా? 
- ఎస్‌.ఎండీ యూనుస్‌, కర్నూలు

జ: యునానీ చికిత్సకు దాదాపు ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బ్యాచిలర్స్‌ ఇన్‌ యునానీ మెడికల్‌ సైన్సెస్‌ (బీయూఎంఎస్‌) కోర్సు చదవాలనుకునేవారు ఇంటర్‌ (10+2)లో బైపీసీ చదవాల్సి ఉంటుంది. బీయూఎంఎస్‌ కోర్సు వ్యవధి అయిదేళ్ల ఆరు నెలలు. ఇందులో చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ కోర్సును సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) వారు రెగ్యులేట్‌ చేస్తారు. కోర్సును పూర్తిచేసిన విద్యార్థిని హకీమ్‌ అని పిలుస్తారు. పదో తరగతి వరకు ఉర్దూను ఒక సబ్జెక్టుగా చదివుండాలి లేదా ఇంటర్‌లో ఉర్దూను ఒక సబ్జెక్టుగా లేదా ఆప్షనల్‌గా చదివినవారు మాత్రమే అర్హులు. ఎందుకంటే ఈ కోర్సును ఉర్దూ మాధ్యమంలోనే అందిస్తారు. 
మీ అమ్మాయి విషయంలో మీరు ఉర్దూ ఆప్షనల్‌గా ఉన్న విద్యాలయంలో చదివించడం శ్రేయస్కరం. మెరిట్‌ (10+2) ఆధారంగా సాధారణంగా బీయూఎంఎస్‌ కోర్సులో ప్రవేశ అర్హత లభిస్తుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా దూరవిద్య పాఠశాల స్థాయిలో చేయడం కుదురుతుంది. ముఖ్యంగా విద్యార్థి తనకిష్టమైన రంగంలో అడుగుపెట్టి కృషి చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

* ఆ కోర్సు సీఏతో సమానమేనా?
ఞ ఏసీసీఏ చదవాలనుకుంటున్నాను. దాని ప్రాముఖ్యాన్ని తెలపండి. ఇది సీఏతో సమానమేనా? మనదేశంలో ఈ కోర్సు చేసినవారికి అవకాశాలెలా ఉన్నాయి? 
- ఎన్‌.పి. భాస్కర్‌
జ: అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెన్స్‌ (ఏసీసీఏ) ఒక అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ అకౌంటింగ్‌ బాడీ. చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సును అకౌంటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెన్స్‌ ఆఫ్‌ ఇండియా వారు అందించే ఫ్లాగ్‌ షిప్‌ కోర్సు. ఈ రెండు కోర్సులకూ అకౌంటింగ్‌ రంగంలో ప్రత్యేకత, గుర్తింపు ఉన్నాయి. ఏసీసీఏ కోర్సుకు అంతర్జాతీయ గుర్తింపు దాదాపుగా 130 దేశాల్లో ఉంది. అంతర్జాతీయంగా వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు ఏసీసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. బహుళజాతి సంస్థల్లో ఈ కోర్సుకు మంచి గిరాకీ ఉంది. 
ఇక సీఏ కోర్సు పూర్తిచేసినవారు మనదేశంలో సొంతంగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంతకం ఆడిటింగ్‌, టాక్స్‌, రిపోర్టింగ్‌లో చాలా ప్రాముఖ్యమైంది. ఏసీసీఏ పూర్తి చేసినవారికి ఈ సౌలభ్యం లేదు. కానీ ఉపాధి విషయానికి వస్తే రెండు 
* ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని