పెట్రో ఇంజినీరింగ్‌కు ఏ అర్హతలు?

పెట్రోలియం ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌....

Published : 12 Mar 2018 01:24 IST

పెట్రో ఇంజినీరింగ్‌కు ఏ అర్హతలు?

పెట్రోలియం ఇంజినీరింగ్‌ చేయాలనుంది. మనదేశంలో దీనికున్న అవకాశాలేంటి?

- సుమంత్‌ నాయుడు

జ: పెట్రోలియం ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ చదివుండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ- విశాఖపట్నం, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ-అమేధి, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, ఐఐటీ- బాంబే, ఐఐటీ- ధన్‌బాద్‌ వంటి ప్రముఖ విద్యాలయాల్లో బీటెక్‌ (పెట్రోలియం ఇంజినీరింగ్‌) కోర్సులో ప్రవేశాన్ని పొందవచ్చు. వీరికి డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, రిజర్వాయర్‌ ఇంజినీర్‌, ఆఫ్‌ షోర్‌ డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఆయిల్‌ సంస్థలైన ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌ పెట్రోలియం ఎస్సార్‌ ఆయిల్‌ వంటి ప్రముఖ ఆయిల్‌ సంస్థలు మంచి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.


ఏం నేర్చుకుంటే మేలు?

నా తమ్ముడు బీటెక్‌ (సీఎస్‌ఈ) 2015లో పూర్తిచేశాడు. తరువాత ఐబీఎంలో ఏడాదిపాటు మాన్యువల్‌ టెస్టర్‌గా పనిచేసి, మానేశాడు. ప్రస్తుతం సెలెనియం కోర్సును నేర్చుకుంటున్నాడు. దీంతోపాటు ఏం నేర్చుకుంటే అతని భవిష్యత్తు బాగుంటుంది?

- కె. కులదీప్‌

జ: ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ టూల్స్‌ రాకతో మాన్యువల్‌ టెస్టింగ్‌ నిపుణులకు అవకాశాలు తగ్గాయి. దీంతో మాన్యువల్‌ టెస్టర్స్‌ ప్రసిద్ధ ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ టూల్‌ అయిన సెలెనియాన్ని నేర్చుకుంటున్నారు. వెబ్‌ బేస్‌డ్‌ అప్లికేషన్‌ టెస్టింగ్‌కు సెలెనియం ఉపయోగకరం. టెస్టింగ్‌ రంగంలో విజయం సాధించాలనుకునేవారు సెలెనియం టూల్‌తోపాటు జావా బేసిక్స్‌పై పట్టు సాధించాలి. క్వాలిటీ అస్యూరెన్స్‌ (క్యూఏ)పై మంచి అవగాహన ఉండాలి. ఐఓఎస్‌/ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌ టెస్టింగ్‌ కోసం ఉపయోగపడే ఏపీపీఐయూఎం టూల్‌ను నేర్చుకుంటే తమ ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని