పై చదువులు ఏవి మేలు?

బీఏ (హెచ్‌టీపీ) పూర్తిచేశాను. పై చదువులు ఏవి చదివితే మేలు? నాకున్న ఉద్యోగావకాశాలేవి?

Published : 20 Mar 2018 01:32 IST

పై చదువులు ఏవి మేలు?

* బీఏ (హెచ్‌టీపీ) పూర్తిచేశాను. పై చదువులు ఏవి చదివితే మేలు? నాకున్న ఉద్యోగావకాశాలేవి? 
- కేవీటీ, హైదరాబాద్‌
జ: బీఏ (హిస్టరీ, తెలుగు, పాలిటీ) పూర్తి చేసినవారు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో తమకు ఆసక్తి ఉన్నటువంటి (పై మూడింటిలో) ఏదో ఒక కోర్సును స్పెషలైజేషన్‌గా ఎంచుకుని తమ పై చదువులు కొనసాగించవచ్చు. లేదా ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సును ఎంచుకుని బిజినెస్‌ రంగంలో ఉద్యోగం లేదా సొంత వ్యాపారాన్ని స్థాపించుకోవచ్చు. సాధారణంగా బీఏ (హెచ్‌టీపీ) చదివినవారు ప్రభుత్వ పరీక్షలైన గ్రూప్‌-1, గ్రూప్‌-2లకు సన్నద్ధం కావడం లేదా యూపీఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమై మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి కంప్యూటర్‌ స్కిల్స్‌ పెంపొందించుకుంటే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. హిస్టరీ పట్ల ఆసక్తి ఉన్నవారు ఎంఏ ఆర్కియాలజీ కోర్సును ఎంచుకుంటే మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

స్టార్టప్‌కు ఏ కెమిస్ట్రీ?

  *స్టార్టప్‌ స్థాపనలో ఏ కెమిస్ట్రీ కోర్సు ఉపయోగపడుతుంది? ఆర్గానిక్‌, అనలిటికల్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీల్లో భవిష్యత్తుకు ఉపయోగపడేదేది? కోర్సులను అందించే విశ్వవిద్యాలయాలూ, ఉద్యోగావకాశాలనూ తెలపండి. ఐఐటీ దిల్లీలో పీహెచ్‌డీ ఉందా?  

 - డి. పౌర్ణమి
జ: అంకుర సంస్థ/ స్టార్టప్‌ను స్థాపించడంలో ఆచరణాత్మకమైన వ్యాపార ఆలోచన చాలా ముఖ్యం. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ జోసఫ్‌ ప్రకారం సమాజం ఎదుర్కొన్న/ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు కెమిస్ట్రీ పరిష్కారం చూపగలదు. కాబట్టి ముందుగా మీరు ఏ కెమిస్ట్రీ మంచిదో పక్కనపెట్టి సమస్యను కనుక్కోవడానికి ప్రయత్నించి ఆ తరువాత ఆ మార్గంలో అడుగులు వేయడం మంచిది.
ఆర్గానిక్‌ లేదా అనలిటికల్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడేవే. ఇవి వేటికవే తమదైన ప్రత్యేకతను కలిగివున్నాయి. కాబట్టి మీరు మీకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోండి. 
ఐఐటీ-దిల్లీ, బాంబే, బెంగళూరు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఎంఎస్‌సీ కెమిస్ట్రీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ+పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల పరంగా ఎంఎస్‌సీ కెమిస్ట్రీ పూర్తిచేసినవారికి రిసెర్చ్‌ సైంటిస్ట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌, కెమికల్‌ అనలిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను   సాధించుకోవచ్చు. 
* ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని