మైక్రోబయాలజీతో ప్రభుత్వోద్యోగాలు

బీఎస్‌సీ (మైక్రోబయాలజీ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ప్రభుత్వ సంస్థలు అందించే కోర్సులేమైనా ఉన్నాయా?

Published : 03 Apr 2018 01:23 IST

మైక్రోబయాలజీతో ప్రభుత్వోద్యోగాలు

* బీఎస్‌సీ (మైక్రోబయాలజీ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ప్రభుత్వ సంస్థలు అందించే కోర్సులేమైనా ఉన్నాయా?

- ఎస్‌.కుమారస్వామి

జ: డిగ్రీతో అర్హత ఉన్న సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ వంటి పోటీపరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో ఉద్యోగాలకైతే సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, క్లినికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ సర్వే పర్సనల్‌, కెమికల్‌ అసిస్టెంట్‌తోపాటు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ఆక్వా రంగంలో క్వాలిటీ అస్యూరెన్స్‌ వంటి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో (పీజీఎంఐఈఆర్‌, సీఆర్‌ఐజేఏఎఫ్‌, ఎన్‌ఐఏబీ, అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో వంటి అవకాశాలను పొందొచ్చు. కానీ ఇందుకు ఎంఎస్‌సీ మైక్రోబయాలజీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో ముందుకు సాగాలంటే పీజీ చేయడంతోపాటు పరిశోధనపై మక్కువ పెంచుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును సాధించుకోవచ్చు.

ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని