ఫుడ్‌ టెక్నాలజీలో ఏ కోర్సులు?

ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాను. ఫుడ్‌ టెక్నాలజీ చదవాలనుంది. కోర్సు వివరాలు, అందించే సంస్థలు, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

Published : 09 Apr 2018 02:05 IST

ఫుడ్‌ టెక్నాలజీలో ఏ కోర్సులు?

* ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాను. ఫుడ్‌ టెక్నాలజీ చదవాలనుంది. కోర్సు వివరాలు, అందించే సంస్థలు, ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

- రాగప్రణీత్‌ రెడ్డి

జ: ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివినవారు బీఎస్‌సీ లేదా బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులను ఎంచుకోవచ్చు. బీఎస్‌సీ మూడేళ్లు, బీటెక్‌ నాలుగేళ్ల వ్యవధితో ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సుల్లోకి ఎంసెట్‌ ద్వారా అర్హత కల్పిస్తున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ, విజ్ఞాన్‌ యూనివర్సిటీ, సంబంధిత వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సును అందిస్తారు.
ఫుడ్‌ టెక్నాలజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు బహుళజాతి సంస్థల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ), నేషనల్‌ డెయిలీ డెవలప్‌మెంట్‌ బోర్డు లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను పొందవచ్చు. మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వారు ఈ మధ్యనే 500 ఫుడ్‌ పార్కులు నెలకొల్పేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చదివినవారికి క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌, ఫుడ్‌ ప్యాకేజింగ్‌ మేనేజర్‌, బాక్టీరియాలజిస్ట్‌, లెబొరేటరీ సూపర్‌వైజర్‌, రిసర్చ్‌ సైంటిస్ట్‌ వంటి ఉద్యోగాలుంటాయి.

దూరవిద్యలో సైకాలజీ..
* ఎంబీఏ పూర్తిచేశాను. సైకాలజీ చదవాలనుంది. నాకు అర్హత ఉందా? అందించే సంస్థల వివరాలను తెలపండి. దూరవిద్య ద్వారా చేసే వీలుందా?

- ఎన్‌. మానస

 

జ: ఏ డిగ్రీ పూర్తిచేసినవారు అయినా సైకాలజీలో పీజీ చేయడానికి అర్హులు. దూరవిద్యలో కూడా ఈ కోర్సును అభ్యసించవచ్చు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు; ఎస్‌వీ యూనివర్సిటీ, తిరుపతి; ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం; ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ వారు సైకాలజీ పీజీ కోర్సును అందిస్తున్నారు. మీరు ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేసుంటే ఈ కోర్సు మీకు మరింత అవగాహనను పెంచుతుంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు