ఈఈఈ డిప్లొమా తర్వాతేంటి?

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాను. కోర్సు పూర్తి చేసుకున్నాక నాకున్న ఉద్యోగావకాశాలేవి?

Published : 10 May 2018 01:42 IST

ఈఈఈ డిప్లొమా తర్వాతేంటి?

* ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాను. కోర్సు పూర్తి చేసుకున్నాక నాకున్న ఉద్యోగావకాశాలేవి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

- కార్తీక్‌ కర్రే

జ: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాలతోపాటు కంప్యూటర్‌ రంగంలోనూ విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ తయారీ, సరఫరా సంస్థల్లో వివిధ ఉద్యోగాలు, ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, సింగరేణి కాలరీస్‌, అణు, ఇంధన శాఖల్లోనూ ఉద్యోగావకాశాలున్నాయి. ప్రైవేటు ఎలక్ట్రికల్‌ సంస్థలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు తయారు చేసే సంస్థల్లోనూ, అపార్ట్‌మెంట్‌లను నిర్మించే పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు, మునిసిపాలిటీలు, సిమెంట్‌, అల్యూమినియం కర్మాగారాలు, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పాదక సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయి. విద్యుత్‌ రంగ పరికరాల తయారీ సంస్థల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఉద్యోగ ప్రకటనలను గమనిస్తూ దరఖాస్తు విధానం, ఎంపిక, పరీక్ష, ఇంటర్వ్యూ విధివిధానాలను తెలుసుకుని, అవగాహన ఏర్పరచుకుంటే మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు.


న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ కోర్సులేవి?

* ఎంబీఏ పూర్తిచేశాను. ప్రస్తుతం ఓ సంస్థలో మేనేజర్‌గా చేస్తున్నాను. న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీపై కోర్సులు చేయాలని ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థలేవి?

- గౌరీమోహన్‌ పాణిగ్రాహి

జ: తెలుగు రాష్ట్రాల్లో న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీపై కోర్సులు అందుబాటులో లేవు. మీరు మేనేజర్‌గా చేస్తున్నారు కాబట్టి, దూరవిద్య ద్వారా ఈ కోర్సును టెరీ యూనివర్సిటీ ద్వారా చేసే అవకాశముంది. కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ లాంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు చేయవచ్చు.

ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఎంటెక్‌ స్థాయిలో ఒకటి/ రెండు సబ్జెక్టులుగానే బోధిస్తున్నారు కానీ ప్రత్యేకించి ఒక కోర్సుగా అందుబాటులోకి రాలేదు. దీనిని ఒక కోర్సులా కాకుండా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీకి సంబంధించిన 14 రకాల శిక్షణ సంస్థలో స్వల్పకాలిక శిక్షణ పొందవచ్చు. పూర్తి వివరాలకు టెరీ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీస్‌ వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

                                       - ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని