అమ్మాయిలకు మిలటరీలో..

బీటెక్‌ (ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మిలటరీ విభాగంలో పనిచేయాలన్నది నా కోరిక.

Published : 15 May 2018 01:26 IST

అమ్మాయిలకు మిలటరీలో..

బీటెక్‌ (ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మిలటరీ విభాగంలో పనిచేయాలన్నది నా కోరిక. అమ్మాయిలకు మిలటరీలో ఉన్న అవకాశాలేంటి?

 

- దీపిక

జ: ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తున్న వారిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేయాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో మిలటరీ గురించి ఆలోచిస్తున్న తీరు అభినందనీయం. మిలటరీలో ఇంజినీరింగ్‌ ద్వారా పొందగలిగే ఉద్యోగాలకు స్త్రీ, పురుషులకు పెద్దగా తేడా లేదు. అతి తక్కువ ఉద్యోగాలకు మాత్రమే వివాహితులైన మహిళలు అర్హులు కారు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు మీ కలలను సాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు.

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా, ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ద్వారా కూడా మిలటరీలో ప్రవేశించవచ్చు. రక్షణ రంగ సంస్థలైన డీఆర్‌డీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ లాంటి వాటిల్లోనూ ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌ తరువాత ఎంటెక్‌లో చేసే స్పెషలైజేషన్‌ ద్వారా కూడా అవకాశముంటుంది. సిగ్నల్‌ ఇంజినీరింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ పొందినా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఎక్కువే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని