రెగ్యులేటరీ అఫైర్స్‌లో పీజీ!

రెగ్యులేటరీ అఫైర్స్‌లో పీజీ డిప్లొమా చేయాలనుంది. అందించే సంస్థలు, వాటి ప్రవేశ వివరాలను అందించగలరు......

Published : 25 Jun 2018 01:57 IST

రెగ్యులేటరీ అఫైర్స్‌లో పీజీ!

*రెగ్యులేటరీ అఫైర్స్‌లో పీజీ డిప్లొమా చేయాలనుంది. అందించే సంస్థలు, వాటి ప్రవేశ వివరాలను అందించగలరు.
- శ్రీలక్ష్మి
మీ ప్రశ్ననుబట్టి మీరు బీఎస్‌సీ లేదా బీఫార్మసీ/ ఎంఫార్మసీ చేసినవారై ఉండాలి. ఈ కోర్సును నిమ్స్‌ (జయపుర) యూనివర్సిటీ, గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ (జీఐఆర్‌ఏ)- పుణె, జామియా హమ్‌దర్ద్‌ యూనివర్సిటీ- దిల్లీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌- ముంబయి, బయో ఇన్ఫర్మాటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- నోయిడా వారు అందిస్తున్నారు. డిగ్రీలో సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీస అర్హత ఉండాలి. మరిన్ని వివరాలకు పై విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.

మిసైల్స్‌ గురించి చదవాలంటే?

* పదో తరగతి పూర్తిచేశాను. నాకు మిసైల్స్‌ గురించిన సమాచారం అంటే ఆసక్తి. పై చదువులను మిసైల్స్‌కు సంబంధించిన అంశాల్లో చేయాలనుంది. ఇంటర్‌ నుంచి ఏ కోర్సులను ఎంచుకోవడం ద్వారా నా లక్ష్యాన్ని చేరుకోగలను. 

- టి. ఆదిత్య రెడ్డి, నిర్మల్‌
మిసైల్స్‌ రక్షణ శాఖకు చెందినవి. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌లో ఎంపీసీని ఎంచుకోవాలి. తరువాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో డిగ్రీ, పీజీ చేయాల్సి ఉంటుంది. డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీవారు అందించే కోర్సుల ద్వారా మీ సంకల్పాన్ని చేరుకోవచ్చు. దీనికోసం ఎన్‌డీఏ పరీక్ష అర్హత సాధించాలి. దీనిద్వారా మిలిటరీ, ఏర్‌ఫోర్స్‌, నేవీ ఫోర్స్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, డిఫెన్స్‌ సంస్థలైన హెచ్‌ఏఎల్‌, ఎన్‌ఏఎల్‌, ఇతర సంస్థలైన డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ వంటి పరిశోధన సంస్థల్లోనూ ఉద్యోగాన్ని సాధించవచ్చు.
- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు