రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి

పీజీ చదువుతున్నాను. రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి. కోర్సులు, అందించే సంస్థల వివరాలను తెలపండి.

Published : 26 Jun 2018 02:20 IST

రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి

* పీజీ చదువుతున్నాను. రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి. కోర్సులు, అందించే సంస్థల వివరాలను  తెలపండి.

- పావన జ్యోతి

పీజీ స్థాయిలో రూరల్‌ స్టడీస్‌ చేయాలనుకునేవారు మాస్టర్స్‌ ఇన్‌ రూరల్‌ స్టడీస్‌ (ఎంఆర్‌ఎస్‌)ను అందిస్తున్న భవ్‌నగర్‌ యూనివర్సిటీ-గుజరాత్‌, పట్నా యూనివర్సిటీ- పట్నా, నిమ్స్‌ యూనివర్సిటీ- రాజస్థాన్‌, ఆంధ్రా యూనివర్సిటీ, ఇగ్నోవారు అందించే ఎంఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) కోర్సును ఎంచుకోవచ్చు. విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తాయి. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు పై కోర్సులకు అర్హులు.
ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కావాలనుకునేవారు పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సు చేయాలనుకునేవారు డిగ్రీలో కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివుండాలి. బీటెక్‌ (సివిల్‌) చదివినవారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఆంధ్రా, ఆచార్య నాగార్జున, ఉస్మానియా యూనివర్సిటీలు  అందిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని