ఫొటోగ్రఫీ చేయాలనివుంది..

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉంది. కోర్సును అందించే ప్రభుత్వ సంస్థల వివరాలను తెలియజేయండి...

Published : 10 Jul 2018 03:37 IST

ఫొటోగ్రఫీ చేయాలనివుంది..

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉంది. కోర్సును అందించే ప్రభుత్వ సంస్థల వివరాలను తెలియజేయండి.

- రాములు గంగాల  

వెయ్యి పదాల కంటే ఒక చిత్రం ఎక్కువ విషయాన్ని చేరవేస్తుంది. ఫొటోగ్రఫీ చేయాలనుకునేవారికి వైవిధ్యంగా చిత్రాన్ని చూడగలిగే నేర్పు, సృజనాత్మకత, వృత్తిపట్ల అంకిత భావం, దీక్ష వంటి లక్షణాలను అవసరం. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- పుణె, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌- కోల్‌కతా, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌- దిల్లీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ- హైదరాబాద్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌- అహ్మదాబాద్‌ వారు ఫొటోగ్రఫీలో బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ)ను అందిస్తున్నారు. సొంత ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తారు. ముందుగా ఫొటోగ్రఫీ మీ కెరియరా, ఆసక్తా, హాబీనా అనేది నిర్ణయించుకుని ముందుకు అడుగు వేయండి. ఈ రంగంలో శిక్షణ పొందితే ఫిల్మ్‌, మీడియా, మోడలింగ్‌ ఫొటోగ్రఫీ, టీవీ, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా మంచి అవకాశాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని