ఆర్కియాలజీ అంటే ఆసక్తి...

ఆర్కియాలజీపై ఆసక్తి ఉంది. డిగ్రీ చదువుతున్నాను. నాకు అర్హత ఉందా? ఉంటే డిగ్రీ తరువాత ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి?

Published : 21 Aug 2018 01:45 IST

ఆర్కియాలజీ అంటే ఆసక్తి...

ఆర్కియాలజీపై ఆసక్తి ఉంది. డిగ్రీ చదువుతున్నాను. నాకు అర్హత ఉందా? ఉంటే డిగ్రీ తరువాత ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి?

- రాములు గంగుల

సంస్కృతి, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు. ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీలో పీజీని చేయడం ద్వారా ఈ రంగంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సులో ఆర్కియాలజీతోపాటు ఫొటో హిస్టరీ, ఆర్ట్‌, మ్యూజియాలజీ, ఆర్కియోమెట్రీ వంటి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.
గొప్ప పరిశీలన, గ్రహణ శక్తి, విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే నైపుణ్యాలను విద్యార్థులు ఇనుమడింపచేసుకోవాలి. ఈ కోర్సును యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మను స్క్రిప్టాలజీ-తమిళ్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ మ్యూజియాలజీ అండ్‌ కన్జర్వేషన్‌- యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌-దిల్లీ వారు అందిస్తున్నారు.


హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలంటే..?

డిగ్రీ చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటున్నాను. కోర్సు వివరాలు, అర్హత, అందించే సంస్థల వివరాలను అందించండి.

- దివ్య

టూరిజం, సేవాపరిశ్రమలకు ఆదరణ పెరగడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఏదేని డిగ్రీ చదివినవారు ఎంబీఏ-హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలజీ అడ్మినిస్ట్రేషన్‌, ఎంఎస్‌సీ
హాస్పిటాలజీ అడ్మినిస్ట్రేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పీజీ స్థాయి కోర్సులను ఎంచుకోవచ్చు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, వివిధ రాష్ట్రాల్లోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌
మేనేజ్‌మెంట్‌ సంస్థలు, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, క్రైస్ట్‌ యూనివర్సిటీ, ద్వారా డిప్లొమా, బ్యాచిలర్స్‌, పీజీ స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అభ్యసించవచ్చు.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ప్రతి ప్రశ్నకీ సరైన సమాధానం


విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించిన మీ సందేహాలను ‘ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌’ విభాగంలో పోస్ట్‌ చేయండి. నిపుణులు జవాబులను అందిస్తారు. క్లిక్‌ చేయండి
https://goo.gl/zi6tEo  లేదా www.eenadupratibha.net



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని