బయోటెక్నాలజీ తరువాత సైకాలజీ!

పీజీలో సైకాలజీ చదవడానికి ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. మానవ ప్రవర్తన, శైలి, ఆలోచనతత్వం వంటి వాటిని అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ. సైకాలజీలో వివిధ ఉపశాఖలు ఉన్నాయి.....

Published : 11 Sep 2018 01:41 IST

బయోటెక్నాలజీ తరువాత సైకాలజీ!

* డిగ్రీ (బయోటెక్నాలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. సైకాలజీ చదవాలనుంది. నాకు అవకాశముందా?

- కీర్తి రెడ్డి

పీజీలో సైకాలజీ చదవడానికి ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. మానవ ప్రవర్తన, శైలి, ఆలోచనతత్వం వంటి వాటిని అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ. సైకాలజీలో వివిధ ఉపశాఖలు ఉన్నాయి. ఆర్గనైజేషనల్‌ సైకాలజీ, బిహేవియరల్‌ సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, ఎడ్యుకేషనల్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ వీటిల్లో ముఖ్యమైనవి. ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారికి కార్పొరేట్‌, స్వయం ఉపాధి అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైద్రాబాద్‌ల్లో ఎంఎస్‌సీ సైకాలజీ కోర్సు అందుబాటులో ఉంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు