Group-1: తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల

తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది.   

Updated : 01 Jun 2024 15:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు టీజీపీఎస్సీ (TGPSC) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం హాల్‌టికెట్లను విడుదల చేసింది.  జూన్‌ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట జరిగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.  పరీక్ష రోజు ఉదయం 9గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థుల్ని అనుమతించనున్నారు. పది దాటితే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు