CISCE Results: ఐసీఎస్‌ఈ 10, ఐఎస్‌సీ 12 ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

CISCE Results: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను  ఈ కింది వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

Updated : 14 May 2023 15:10 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE) ఆదివారం మధ్యాహ్నం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ ఫలితాలు తెలుసుకోచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యదర్శి గెర్రీ అరథోన్‌ వెల్లడించారు. మీ మొబైల్‌ ఫోన్‌లో ICSE అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ యూనిక్‌ ఐడీని ఎంటర్‌ చేసి 09248082883 నంబర్‌కు పంపడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 29 జరగ్గా.. ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31వరకు కొనసాగాయి. ఈ పరీక్షలను దాదాపు 2.5లక్షల మంది విద్యార్థులు రాశారు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని