Bank Jobs: ఐడీబీఐలో ఆఫీసర్‌ పోస్టులకు జూన్‌ 1 నుంచే దరఖాస్తులు ఆహ్వానం

Bank Jobs: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 31 May 2023 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI)లో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 1,172 పోస్టులకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వగా..  వీటిలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టులు 136; ఎగ్జిక్యూటివ్‌ (కాంట్రాక్టు) ఉద్యోగాలు 1036 చొప్పున ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి బ్యాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్‌ 7తో ముగియనుంది. అదే, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు మాత్రం జూన్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలివే..

  • స్పెషలిస్టు క్యాడర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల మొత్తం 136.  జూన్‌ 1 నుంచి 15వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • బ్యాంకులోని వివిధ విభాగాల్లో 84 మేనేజర్‌ పోస్టులు, 46 అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, 6 డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ చొప్పున మొత్తం 136 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • ఈ రెండు నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలకు హోదాలను బట్టి నెలకు వేతనం కనిష్ఠంగా రూ.29వేలు ఉండగా.. గరిష్ఠంగా రూ.1,55,000వరకు ఇవ్వనున్నారు.

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక

  • ఎగ్జిక్యూటివ్‌ (కాంట్రాక్టు) పోస్టులు మొత్తం 1036. మే 24 నుంచి జూన్‌ 7వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 2న ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పరీక్ష తేదీ మారే అవకాశం ఉంది.
  • ఈ పోస్టులకు వయో పరిమితి 20 నుంచి 25 ఏళ్లు.  ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.  ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే ఈ పోస్టులకు భర్తీ చేస్తారు. ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఏటా సర్వీసును పొడిగిస్తారు. 
  • తొలి ఏడాది వేతనం రూ.29వేలు; రెండో ఏడాది రూ.31వేలు; మూడో సంవత్సరం రూ.34వేలు చొప్పున ఇస్తారు. 
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌,  మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌లను ఎంపిక చేస్తారు. 
  • ఆయా పోస్టులకు విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్ష, కనీస వయస్సు, దరఖాస్తు రుసుం, పరీక్ష కేంద్రాలు తదితర వివరాలను ఈ కింద పేర్కొన్న నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోండి.

ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని