Current Affairs: ఓటింగ్‌లో భారతీయుల ప్రపంచ రికార్డు!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు కోట్ల మందికిపైగా ఇండియన్‌ ఓటర్లు ఓట్లేసి‡ రికార్డు సృష్టించారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

Updated : 15 Jun 2024 00:58 IST

కరెంట్‌ అఫైర్స్‌

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరవై నాలుగు కోట్ల మందికిపైగా ఇండియన్‌ ఓటర్లు ఓట్లేసి‡ రికార్డు సృష్టించారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. చైనా వ్యోమనౌక చంద్రుడి రెండోవైపు విజయవంతంగా దిగి అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు సింగపూర్‌ నుంచి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అత్యుత్తమ యూనివర్సిటీల్లో దేశం నుంచి మూడు సంస్థలు స్థానం సంపాదించుకున్నాయి. ఒడిశాలో భాజపా తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహనతో ఉండాలి. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు, విశేషాలు సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఏర్పాటైన        కమిటీలు, కూటములు, ఐక్యరాజ్యసమితి పదవుల్లో క్రమానుగతంగా జరిగిన మార్పుచేర్పులు, వివిధ దేశాలకు ఎన్నికైన నేతలు, ముఖ్యమైన క్రీడా టోర్నీలు, విజేతల వివరాలను తెలుసుకోవాలి.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని