ISRO JObs: బీటెక్‌తో ఇస్రోలో ఉద్యోగాలు.. వేతనం ₹56 వేలకు పైనే..!

ISRO Jobs: ఇస్రోలో భారీగా సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 14వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 25 May 2023 17:00 IST

బెంగళూరు: బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్లలో సైంటిస్ట్‌, ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం 303 పోస్టుల భర్తీకి మే 25 నుంచి జూన్‌ 14వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు జూన్‌ 16వరకు గడువు ఇచ్చారు. 

పూర్తి వివరాలివే..

  • ఇస్రోలోని ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో  మొత్తం 303 సైంటిస్ట్‌/ఇంజినీర్‌( ఎస్సీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 90 కాగా.. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(మెకానికల్) 163;  సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(కంప్యూటర్ సైన్స్): 47; సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ 2; సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ 01 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
  • విద్యార్హతలు: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌లలో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • దరఖాస్తు రుసుంను రూ.250లు చొప్పున నిర్ణయించారు.
  • వయో పరిమితి: 2023 జూన్‌ 14 నాటికి 28 ఏళ్లు మించరాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.
  • ప్రారంభ వేతనం: నెలకు ₹56,100 చొప్పున ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ ఎప్పుడు నిర్వహించేది మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని