Job Notifications: నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌ తార్నాకలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) డైరెక్ట్‌ ప్రాతిపదికన లోయర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Jun 2024 00:06 IST

క్లర్క్‌ పోస్టులు 

హైదరాబాద్‌ తార్నాకలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) డైరెక్ట్‌ ప్రాతిపదికన లోయర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ క్లర్క్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 14. దరఖాస్తు ఫీజు రూ.1200. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 25 జూన్‌ 2024.


నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) మెకానికల్, ఎలక్ట్రికల్‌ వర్క్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, మెటలర్జీ విభాగాల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 51. దరఖాస్తు ఫీజు రూ.200. అర్హులైనవారు 26 జూన్‌ 2024 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


 ఉచిత లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌ 

హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ 2024-2025 విద్యా సంవత్సరానికి ఆపరేషన్‌ ఎమరాల్డ్‌లో భాగంగా ఉచితంగా లాంగ్‌ టర్మ్‌ నీట్‌ కోచింగ్‌ ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్టీ కేటగిరీ బాలబాలికలు ఈ శిక్షణలో ప్రవేశానికి అర్హులు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 26 జూన్‌ 2024.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం 

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని