Karunya University: కారుణ్య వర్సిటీకి న్యాక్‌ A++ గుర్తింపు

తమిళనాడు కోయంబత్తూరులోని కారుణ్య విశ్వవిద్యాలయం అరుదైన గౌరవం దక్కించుకుంది......

Published : 19 Aug 2022 16:51 IST

దిల్లీ: తమిళనాడు కోయంబత్తూరులోని కారుణ్య డీమ్డ్‌ విశ్వవిద్యాలయం అరుదైన గౌరవం దక్కించుకుంది. విద్యార్థులకు వినూత్న కోర్సులు బోధన, పరిశోధనలు, ఉద్యోగాల కల్పన, మౌలికవసతులు, సరికొత్త ఆవిష్కరణలు తదితర అంశాల్లో ‘కారుణ్య’ చేసిన విశేష కృషిని గుర్తించిన న్యాక్‌  (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) అత్యున్నత గ్రేడ్‌ను ఇచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (డీమ్డ్‌ వర్సిటీ)కి న్యాక్‌ అత్యున్నత గ్రేడ్‌ A++ గుర్తింపు లభించినట్టు ఛాన్సలర్‌ డా.పాల్‌ దినకరన్‌ వెల్లడించారు. ఇంత గొప్ప విజయం సాధించడంలో భాగస్వాములైన వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఇటీవల కారుణ్య వర్శిటీని సందర్శించిన ఏడుగురు సభ్యుల బృందం అక్కడి మౌలిక వసతులను తనిఖీ చేసింది. అనంతరం ఆ నిపుణుల ప్యానల్‌ ఇచ్చిన సూచనల ఆధారంగా వర్సిటీకి న్యాక్‌ ఈ అత్యున్నత గుర్తింపును జారీ చేయడం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని