Kendriya Vidyalaya: ఇంకో వారమే గడువు.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేశారా?

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు దగ్గరపడుతోంది. ఆసక్తి కలిగిన వారు తమ పిల్లలను చేర్పించేందుకు దరఖాస్తు చేయాలంటే ఇంకా వారం రోజులే గడువు ఉంది.

Updated : 14 Apr 2023 14:27 IST

హైదరాబాద్‌: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.  దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు సీట్ల భర్తీ కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(కేవీఎస్‌) నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 17న రాత్రి 7గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉంది. కేవీల్లో చేరాలనే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలంటే ఇంకా వారం రోజులే గడువు ఉంది. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి 

కేవీల్లో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్‌ తొలి జాబితాను ఏప్రిల్‌ 20న విడుదల చేసి ఏప్రిల్‌ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు KVS ఓ ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొబైల్‌ యాప్‌ (https://kvsonlineadmission.kvs.gov.in/apps/) ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఈ విషయాలు తెలుసుకోండి..

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. 
  • ఎంపిక విధానం..: ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ఎంపిక  ఉంటుంది. ప్రాధాన్య కేటగిరి ప్రకారం సీట్ల కేటాయింపు చేస్తారు. ఉన్న సీట్ల కంటే దరఖాస్తుల ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేపడతారు.
  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 11వ తరగతికి ఎంపిక చేస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియను పాటిస్తారు. ఎస్సీ-15 శాతం, ఎస్టీ-7.5 శాతం, ఓబీసీ-27 శాతం, దివ్యాంగులకు 3శాతం చొప్పున కేటాయిస్తారు.
  • కేవీల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి  వయసు 6-8 ఏళ్ల మధ్యలో ఉండాలి. రెండు, మూడు తరగతులకు 7-9 ఏళ్లు, నాలుగో తరగతికి 8-10, ఐదో తరగతికి 9-11, ఆరో తరగతికి 10-12, ఏడో తరగతికి 11-13, ఎనిమిదో తరగతికి 12-14, తొమ్మిదో తరగతికి 13-15 , పదో తరగతికి 14-16 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరి వారికి  నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని