MBBS results: ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల

కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌-2 పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి.

Updated : 28 Mar 2023 23:51 IST

వరంగల్‌:  ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌ -2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.25శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం(KNRUHS) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫలితాల జాబితాను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 43 మంది డిస్టింక్షన్‌ సాధించగా.. 1300 మంది ఫస్ట్‌ క్లాస్‌ 1703 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష ఫలితాలను విద్యార్థులు  అధికారిక వెబ్‌సైట్‌ https://www.knruhs.telangana.gov.in/లో చెక్‌ చేసుకోవచ్చని సూచించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని