Updated : 14 Aug 2022 08:56 IST

LPU: ₹3కోట్ల ప్యాకేజీ సాధించిన ఎల్పీయూ గ్రాడ్యుయేట్‌ (ప్రకటన)

విద్యలో మేటి.. ఉద్యోగాల్లోనూ ‘ఎల్‌పీయూ’కి లేదు సాటి!

ఇంటర్నెట్ డెస్క్‌: లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) విద్యార్థులు ప్లేస్‌మెంట్లలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఆ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్‌ మహమ్మద్‌ ఓ జర్మనీ కంపెనీలో రూ.3కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి ఔరా అనిపించుకొంటున్నాడు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్‌ అయిన యాసిర్‌ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. కేరళకు చెందిన యాసిర్‌ ఎల్‌పీయూలో కంప్యూటర్‌ సైన్స్‌ (CSE)విభాగంలో బీటెక్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం జర్మనీలో ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు. ‘‘ఎల్‌పీయూలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక నేను మరే ఇతర డిగ్రీని అభ్యసించలేదు. ఆ వర్సిటీలో చదువుతున్న సమయంలోనే నేర్చుకున్న బలమైన ఫండమెంటల్సే నా విజయానికి కారణం’’ అని యాసిర్‌ చెప్పుకొచ్చాడు.

ఎల్‌పీయూలో చదువుతున్నప్పుడు యాసిర్‌ ఎప్పుడూ చదువుల్లో ముందుండేవాడు. 8.6CGPAతో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. క్యాంపస్‌లో అనేక హ్యాకథాన్‌లు, ఇతర సాంకేతిక ఈవెంట్లలో పాల్గొనేవాడు.. వాటిలో చాలా వరకు గెలుపొందాడు. ‘‘నేను ఎల్‌పీయూలో ఉన్నప్పుడే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), మెషిన్‌ లెర్నింగ్‌ (ML) వంటి సరికొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి స్నేహితుల్ని సంపాదించుకున్నా. అధ్యాపకులు అందించిన సహకారం, గొప్ప మార్గదర్శకత్వమే నేనీ విజయం సాధించడానికి దోహదపడింది. జర్మనీలో పనిచేసేందుకు ఇంత గొప్ప అవకాశం పొందడం ద్వారా కేవలం నాతల్లిదండ్రులే కాకుండా మొత్తం విశ్వవిద్యాలయం, భారతదేశం గర్వపడేలా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అని యాసిర్‌ మహమ్మద్‌ చెప్పుకొచ్చారు.

ప్లేస్‌మెంట్లలో ఇలాంటి రికార్డులు ఎల్‌పీయూకు కొత్తమీ కాదు. గతంలోనూ భారీ సంఖ్యలో ఇక్కడి ఉద్యోగులు ఉన్నత కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2022లో జరిగిన ప్లేస్‌మెంట్లలో యాసిర్‌ రూ.3కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక కాగా.. ఈ వర్సిటీలోని వేలాది మంది పూర్వ విద్యార్థులు కూడా రూ.కోటి, అంతకన్నా అధిక ప్యాకేజీలతో ప్రతిష్ఠాత్మక కంపెనీలైనా గూగుల్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, మెర్సిడెస్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు. ఇటీవల ఎల్‌పీయూలో బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ హరేకృష్ణ మహ్తో బెంగళూరులోని గూగుల్‌ కంపెనీలో రూ.64లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఎల్‌పీయూ గురించి హరేకృష్ణ ఏమంటున్నారో మీరే వినండి..

ఎల్‌పీయూ సాధించిన ప్లేస్‌మెంట్‌ రికార్డులకు సాటిలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలను నేర్పుతూనే అంతులేని అవకాశాలకు వారిధిలా నిలుస్తోంది. విద్యార్థుల ఎదుగుదలకు సహకరిస్తూ వారిని ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా మార్గదర్శనం చేస్తోంది. దీంతో ఈ ఏడాది  ఎల్‌పీయూలో జరిగిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే బీటెక్‌ విద్యార్థి అర్జున్‌ రూ.63లక్షల ప్యాకేజీతో ఉన్నత కొలువుకు ఎంపికయ్యాడు. దేశంలో ఇంజినీరింగ్ ఫ్రెషర్లు సాధించిన అత్యధిక ప్యాకేజీల్లో ఇదొకటి. అసలు ఈ వర్సిటీ గురించి అర్జున్‌ ఏం చెబుతున్నారో ఇక్కడ వినొచ్చు. 

ఇలా కేవలం ఒకరో ఇద్దరో కాదు.. ఎల్‌పీయూ నుంచి 2021-2022 బ్యాచ్‌కి చెందిన 431 మంది విద్యార్థులు రూ.10లక్షల అంతకన్నా ఎక్కువ ప్యాకేజీతో కొలువులకు ఎంపికయ్యారు. అది మాత్రమే కాకుండా బ్రాండెడ్‌ కంపెనీలు కూడా రూ.10లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీల్లో భారీ సంఖ్యలో విద్యార్థులను నియమించుకున్నాయి. ప్రపంచంలోని టాప్‌ కంపెనీలు ఈ వర్సిటీ నుంచే విద్యార్థులను తీసుకొనేందుకు మొగ్గుచూపుతున్నాయి. కాగ్నిజెంట్‌ 670+ విద్యార్థులను నియమించుకోగా.. క్యాప్‌జెమిని 310+, విప్రో 310+, MPhasis 210+, అసెంచర్‌ 150+ ఇలా.. అనేక కంపెనీలు ఎల్‌పీయూ విద్యార్థులను నియమించుకున్నాయి. గత కొద్ది సంవత్సరాల్లో 20వేలు కన్నా ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌/ఇంటర్న్‌షిప్‌ల్లో ఎల్‌పీయూ విద్యార్థులే టాప్‌లో ఉన్నారు. కొన్ని ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు 5వేలకు పైగా ఆఫర్లు ఇచ్చాయి.

అద్భుతమైన ప్లేస్‌మెంట్‌ రికార్డులకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన ఎల్‌పీయూ దేశంలో ఎలా అగ్రశ్రేణి సంస్థగా అవతరించిందో ఈ ఉదాహరణలే సూచిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్-2022 ద్వారా ప్రపంచవ్యాప్తంగా 74వ ర్యాంక్‌ను పొందిన ఎల్‌పీయూ వర్సిటీ.. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా యువతకు నాణ్యమైన విద్యతో పాటు అద్భుతమైన ప్లేస్‌మెంట్లు రావడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఎల్‌పీయూ 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్‌లు, అత్యాధునిక క్యాంపస్, గొప్ప ప్లేస్‌మెంట్ రికార్డ్ ద్వారా విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఈ యూనివర్శిటీలో 28 రాష్ట్రాలు, దాదాపు 50+ దేశాల నుండి విద్యార్థులు ఉన్నారు.  2022 ఎల్‌పీయూ అడ్మిషన్ ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. దీంట్లో అడ్మిషన్‌ కావాలనుకుంటే పరీక్ష, ప్రవేశాల ప్రక్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు https://bit.ly/3LAGbu7ను క్లిక్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని