Central Government Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?
Central Government Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 3 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసి ఆసక్తికలిగిన అభ్యర్థులు జూన్ 3 నుంచి 23వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..
- ఐబీలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) గ్రేడ్ II/టెక్నికల్ పోస్టుల సంఖ్య: 797
- దరఖాస్తుల ప్రక్రియ: జూన్ 3నుంచి 23 రాత్రి 11.59గంటల వరకు
- దరఖాస్తు రుసుం: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.450లు; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు నుంచి మినహాయింపు
- వయో పరిమితి: 18 నుంచి 27 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో సడలింపు
- విద్యార్హతలు: డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ విద్యా సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్/మేథమెటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి). లేదా బీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వేతన స్కేలు: రూ.25,500 - 81,100 (కేంద్రం ఇచ్చే ఇతర అలవెన్సులు అదనం)
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?