నెటిజన్ల మనసులు గెలుచుకుంటోన్న.. ‘ముత్తూట్‌ మినీ’ వీడియో మీరు చూశారా?

దేశంలో ప్రముఖ గోల్డ్‌ లోన్‌ ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్‌ మినీ ఫైనాన్సియర్స్‌ లిమిటెడ్‌  తాజాగా రూపొందించిన ప్రకటన నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. నేటి తరం యువతుల కలలు, ఆశయాల్ని.....

Updated : 14 Jan 2022 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో ప్రముఖ గోల్డ్‌ లోన్‌ ఎన్‌బీఎఫ్‌సీ ముత్తూట్‌ మినీ ఫైనాన్సియర్స్‌ లిమిటెడ్‌  తాజాగా రూపొందించిన ప్రకటన నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. నేటి తరం యువతుల కలలు, ఆశయాల్ని ప్రతిబింబిచేలా రూపొందించిన ఈ వీడియో  ఇంటర్నెట్‌లో ప్రశంసలు అందుకుంటోంది. దాదాపు 2మిలియన్ల మందికి పైగా ఈ యాడ్‌ను వీక్షించారు. అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ ప్రక్కాట్‌ ఈ యాడ్‌ని రూపొందించగా, సెలబ్రిటీ సినిమాటోగ్రాఫర్‌ జోమన్‌ టి.జాన్ కెమెరా సహకారం అందించారు. ఈ ద్వయం ఇందులో చూపించిన లద్దాఖ్‌ పరిసర ప్రాంతాలు వీక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఈ ప్రకటనలో నటీనటుల భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తపరచగా.. అంతే అద్భుతంగా తన సినిమాటోగ్రఫీతో జాన్‌ వీక్షకులకు అందించారు. జీవితంలో అమ్మాయిలు సాధించలేని కలలు లేవనే సందేశమే ఇతివృత్తంగా ఈ యాడ్‌ని రూపొందించారు. అలాగే, వారి ఆశలు, ఆశయాలను కలలను ఏవీ అడ్డుకోలేని లద్దాఖ్‌ ప్రయాణం ద్వారా దర్శకుడు చూపించాడు. ఇందులో అమ్మాయి క్యారెక్టర్‌కు తండ్రి అందించే ప్రోత్సాహం కూడా నిజ జీవితంలో ప్రతి తండ్రీ ఆడపిల్లలకు ప్రతి విషయంలో ఎలా తోడుగా ఉంటారనే అంశాన్ని కళ్లకుకట్టేలా ఉంది. ముత్తూట్ మినీ నినాదం కూడా అదే ‘ఎల్లప్పుడూ మీకు తోడుగా’!

ఈ ప్రకటనకు వస్తున్న ఆదరణపై ముత్తూట్ మినీ ఎండీ మాథ్యూ ముత్తూట్ మాట్లాడుతూ ‘‘మేం రూపొందించిన ప్రకటనకు ఈ స్థాయిలో ఆదరణ రావడం మాకెంతో సంతోషంగా ఉంది. మహిళల కలల్ని సాధించుకునేందుకు సంప్రదాయ కట్టుబాట్లను ఛేదించాలనేది చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ సమాజంలో మహిళ పట్ల ఉన్న మూస పద్ధతులను, అపోహలను ఈ ప్రకటన పటాపంచలు చేస్తుంది. సామాజిక బాధ్యత కలిగి సంస్థగా సమాజంలో బలంగా నాటుకుపోయిన సమస్యను స్పృశించడం పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు  ఇదే సరైన సమయం. సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థికపరమైన రంగాల్లో మహిళల ప్రాముఖ్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే, ఈతరం మహిళల్ని మేం కోరేది ఒక్కటే.. మీరు ఆర్థికపరమైన అంశాల్లో స్వతంత్రులుగా ఉండండి. మీరు వెళ్లాలనుకున్న ప్రాంతాలకు వెళ్లండి. ఇందుకు మీకు ముత్తూట్ మినీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది’’ అని సందేశమిచ్చారు. 

ఇక ప్రకటన విషయానికొస్తే.. లద్దాఖ్‌లో అమ్మాయి బైక్‌ వెళుతూ రోడ్డు టర్నింగ్ పాయింట్ తిరుగతూ జీవితంలో మనకు కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పడంతో ప్రకటన ఆరంభమవుతుంది. తర్వాత ఒక రెస్టారెంట్‌లో అమ్మాయికి, అబ్బాయికీ పెళ్లిచూపులు జరుగుతుంటాయి. అబ్బాయి మాట్లాడుతూ పెళ్లి తర్వాత నాకు కొన్ని బిజినెస్ ప్లాన్‌లు ఉన్నాయి. అందుకు మీ సహకారం కావాలి అని అమ్మాయిని అడుగుతాడు. నాకు అందులో ఎలాంటి ఆసక్తి లేదని ఆ అమ్మాయి బదులిస్తుంది. ఆసక్తి అవసరం లేదు నీ సహాయం ఉంటే చాలంటూ అమ్మాయి చేతి నగలను చూస్తూ అబ్బాయి బదులిస్తాడు. దాంతో అమ్మాయి ఒకింత సంతోషమైన ముఖంతో దూరంగా కూర్చున్న తండ్రివైపు చూస్తూ బైక్‌ రైడ్‌కు వెళ్లాలనే తన కోరకను తెలియజేసేలా మణికట్టు చేతిని తిప్పుతుంది. తర్వాత అమ్మాయి బైక్‌పై రైడ్‌కు వెళుతున్నట్లు చూపిస్తూ.. అబ్బాయితో ఇలా చెబుతుంది. జీవితంలో నేను ఆశించేది..లైఫ్‌ పార్టనర్‌షిప్‌ కానీ, బిజినెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ కాదంటూ అబ్బాయితో చెబుతుంది. ఆ తర్వాత తన నగలను ముత్తూట్ మినీలో తాకట్టు పెట్టి బైక్‌ కొని రైడ్‌కు వెళుతుంది. నాతోపాటు ఎవరున్నా లేకున్నా నా తండ్రి నావెంటే ఉంటారు అని అమ్మాయి చెబుతుంటే తండ్రి మరో బైక్‌పై ఆమె వెనుక నుంచి వచ్చే సన్నివేశం ఎంతో కళాత్మకంగా ఉంటుంది. మీరు ముఖ్యం, మీ కలలు ఎంతో ముఖ్యం అంటూ ప్రకటన ముగుస్తుంది.

యాడ్‌ థీమ్‌: ముత్తూట్ మినీ ఎప్పుడూ, ఎల్లప్పుడూ మీతోనే నినాదంలాగానే మీకు తోడుగా ఎవరున్నా లేకున్నా మీ తండ్రి ఉంటారు. మీ కలలకు తోడుగా ముత్తూట్ మినీ ఉంటుంది. బంగారు రుణాలు మీ జీవితంలోని ప్రతి మలుపులో మిమ్మల్ని స్వంతత్రులుగా ఉంచేందుకు సహకరిస్తాయి అనే టైటిల్‌తో ప్రకటన పూర్తవుతుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని