NEET Results 2021: నీట్‌ ఫలితాలు.. ఏపీ, తెలంగాణలో చరిత్ర సృష్టించిన ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు (ప్రకటన)

ఇటీవల వెలువడిన నీట్‌-2021 ఫలితాల్లో ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు సత్తా చాటారు. 720/720 మార్కులతో ఆలిండియా స్థాయిలో ముగ్గురు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు.

Updated : 30 Jul 2022 16:22 IST

ఇటీవల వెలువడిన నీట్‌-2021 ఫలితాల్లో ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులు సత్తా చాటారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఆకాశ్‌ బైజూస్‌ రెండో ఏడాది క్లాస్‌రూమ్‌ విద్యార్థి అయిన తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టెరి 720/720 మార్కులతో ఆలిండియా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. మృణాల్‌ సహా మరికొంత మంది క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ విద్యార్థులు సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆకాశ్‌ బైజూస్‌ ఘనతను కొనసాగించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఆకాశ్‌ బైజూస్‌ క్లాస్‌రూమ్‌ విద్యార్థులు అధిక సంఖ్యలో నీట్‌లో అర్హత సాధించారు. మొత్తం 63,564 మంది ఈ ఏడాది నీట్‌ క్వాలిఫై అవ్వగా.. అందులో 50 వేలమంది ఆకాశ్‌ బైజూస్‌ క్లాస్‌రూమ్‌ స్టూడెంట్సే.

ఈ ఏడాది టాప్‌ స్కోరర్లు..

ఆలిండియా స్థాయిలో టాప్‌-10 ర్యాంకులు సాధించిన వారిలో 8 మంది ఆకాశ్‌ విద్యార్థులు ఉన్నారు. టాప్‌-50లో 23 మంది, టాప్‌-100లో 46 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆకాశ్‌ బైజూస్‌ విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. 2021 నీట్‌ ఫలితాలతో తన పేరిట ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఆకాశ్‌ బైజూస్‌ తిరగరాసింది. 63,500 మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది నీట్‌లో అర్హత సాధిస్తే అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఆకాశ్‌ బైజూస్‌ వాళ్లే ఉండడం ఓ సరికొత్త రికార్డు.

To check all the ranks visit - https://www.aakash.ac.in/neet-results

ఒకవేళ మీరు నీట్‌-2022కి సన్నద్ధమవుతున్నారా? ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఆకాశ్‌ బైజూస్‌ రిపీటర్‌ కోర్సులో ఇప్పుడే చేరండి. త్వరలోనే బ్యాచులు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

టాప్‌ ర్యాంకర్లు వీరే..
తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టెరి , మహారాష్ట్రకు చెందిన కార్తిక జి నాయర్‌, దిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా 720 మార్కులతో ఆలిండియాతో పాటు ఆయా రాష్ట్రాల్లోనూ టాపర్లుగా నిలిచారు. వీరు ముగ్గురూ నీట్‌-2021 కోసం ఆకాశ్‌ బైజూస్‌ రెండేళ్ల ఇంటిగ్రేటెడ్‌ క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌లో చేరారు. వీరితో పాటు నీట్‌-2021లో సత్తా చాటిన విద్యార్థుల విజయ రహస్యాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

టీమ్‌ వర్క్‌తోనే సాధ్యం..

పోటీ పరీక్షల్లో సత్తా చాటాలంటే సమష్టి కృషి అవసరం. మార్గ నిర్దేశం చేసే అధ్యాపకులు, విద్యార్థి, అతడి తల్లిదండ్రుల సహకారం లేనిదే విజయం సాధించడం అంత సులువు కాదు. నీట్‌ ర్యాంకర్‌ కార్తిక విషయంలో ఇదే జరిగింది. ఆమె విజయంలో తల్లిదండ్రులు ముఖ్య భూమిక పోషించారు. కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చి నిరాశకు గురైనప్పుడు నిరుత్సాహ పడొద్దంటూ తల్లిదండ్రులు ఆమె వెన్నంటి నిలిచారు. తప్పుల నుంచి కొత్తగా నేర్చుకోవాలని, మళ్లీ అవే తప్పులు చేయకూడదని తల్లిదండ్రుల సూచన ఆమెకు ఎంతగానో పనికొచ్చింది. అలాగే ఆకాశ్‌ బైజూస్‌ అధ్యాపకుల ‘ఎర్రర్‌ అనాలసిస్‌’ ఆమె స్కోరు మెరుగుపరచడంలో ఉపయోగపడింది. మృణాల్‌ విషయంలో అతడి తల్లిదండ్రులు, అధ్యాపకులు అండగా నిలిచారు. కొన్ని పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు అతి విశ్వాసం పనికిరాదని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు నిరుత్సాహ పడొద్దని సూచించారు. అలాగే, పరీక్ష రోజు ఎలా వ్యవహరించాలో తెలుసుకునేందుకు చివరి రెండు నెలల పాటు మృణాల్‌.. రోజూ సాయంత్రం 2 గంటల నుంచి 5 వరకు ప్రాక్టీస్‌ టెస్టుల్లో పాల్గొనే వాడు. తన్మయ్‌ విషయంలో ఆమె తల్లి కీలకపాత్ర పోషించారు. నీట్‌కు నెల రోజుల ముందు తన్మయ్‌తో పాటు ఆమె దిల్లీ వెళ్లి నీట్‌ సన్నద్ధమవ్వడంలో సహకరించారు.

విజేతల సూచనలు..
భవిష్యత్‌లో నీట్‌ రాబోయే అభ్యర్థులకు విజేతలు పలు సూచనలు చేశారు. ఏవైతే టాపిక్స్‌/చాప్టర్లలో వీక్‌గా ఉన్నారో వాటిపై ఎక్కువగా దృష్టి సారించాలని కార్తిక సూచించింది. రొటేషన్‌, సెమీ కండక్టర్స్‌ వంటి ఫిజిక్స్‌ టాపిక్స్‌పై తనకు అంతగా ఇష్టముండేది కాదని, కానీ నీట్‌లో స్కోరు సాధించాలంటే ఫిజిక్స్‌ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని తర్వాత గ్రహించానని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆకాశ్‌ బైజూస్‌ అధ్యాపకుల సహకారంతో తన సమస్యను అవకాశంగా మలచుకోగలిగానని చెప్పుకొచ్చింది. తన విజయంలో NCERT పాఠ్య పుస్తకాలు ఎంతో తోడ్పాటు నందించాయని మృణాల్‌ చెప్పాడు. నీట్‌ అభ్యర్థులు తప్పకుండా ఈ పుస్తకాలను అనుసరించాలని సూచించాడు. నీట్‌కు సన్నద్ధమయ్యేవారు ప్రారంభం నుంచే NCERT పుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించాలని తన్మయ్‌ సైతం తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని