NEET answer Key: నీట్‌ (యూజీ) ప్రాథమిక ఆన్షర్‌ కీ విడుదల.. ఫలితాలు ఈ వారంలోనేనా?

NEET UG answer Key: నీట్‌ యూజీ సమాధాన ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత అధికారులు కీని విడుదల చేశారు.

Updated : 05 Jun 2023 15:00 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ప్రాథమిక కీని NTA విడుదల చేసింది. మే 7న (ఆదివారం) ఈ పరీక్ష భారత్‌తో పాటు పలు విదేశాల్లో మొత్తం 4097 సెంటర్లలో నిర్వహించగా 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ  పరీక్ష జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీలతో పాటు ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆన్షర్‌ కీని ఛాలెంజ్‌ చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

ఎన్‌టీఏ విడుదల చేసిన సమాధానాల కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్‌ 6 రాత్రి 11.50 గంటల వరకు ఛాలెంజ్‌ చేసుకొనేందుకు సమయం ఇచ్చారు. ఒక్కో సమాధానాన్ని ఛాలెంజ్‌ చేసేందుకు రూ.200లుగా చెల్లించాల్సి ఉంటుంది. కీపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం త్వరలోనే పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, గతంలో ట్రెండ్స్‌ను ఆధారంగా చేసుకొని ఈ వారం రోజుల్లోనే నీట్‌ (యూజీ) ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు పలు జాతీయ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఆన్షర్‌ కీని ఛాలెంజ్‌ చేసేందుకు క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని