PhD: ఆ పోస్టులకు ఇకపై పీహెచ్‌డీ తప్పనిసరి కాదు.. యూజీసీ కీలక నిర్ణయం

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ అవసరం లేదని తెలిపింది.

Updated : 05 Jul 2023 17:38 IST

దిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు పీహెచ్‌డీ(PhD) తప్పనిసరి నిబంధనను తొలగించినట్టు వెల్లడించింది. ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ అవసరం లేదని, ఐచ్ఛికమేనని స్పష్టంచేసింది. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ నేరుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ఆయా అభ్యర్థులు NET/SET/SLET పరీక్షల్లో అర్హత సాధిస్తే చాలని పేర్కొంది.

విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడి (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) కొలువులకు పోటీపడాలంటే పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ 2018లో యూజీసీ నిబంధనలు జారీ చేసింది. దీంతో వర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకాలపై యూజీసీ 2018లో జారీచేసిన నిబంధనలు జులై 1 నుంచే దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజాగా ఆ నిబంధనలను యూజీసీ సవరించడంతో ఇకపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ డిగ్రీ తప్పనిసరి కాదు. దీంతో బోధనపట్ల ఆసక్తి కలిగి పీహెచ్‌డీ డిగ్రీలేని ఎంతోమంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కలగనుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని