Postal Jobs alert: పరీక్ష లేదు.. పోస్టల్‌లో 12,828 పోస్టులు.. దరఖాస్తులకు నేడే లాస్ట్!

Postal jobs: తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 12,828 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలివే..

Updated : 11 Jun 2023 10:53 IST

దిల్లీ:  తపాలా శాఖ(Postal Department)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు గడువు నేటితో ముగుస్తోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌(Postal) సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఖాళీల భర్తీకి మే నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు మే 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 11తో ముగియనుంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు ఈరోజు వరకే సమయం ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

వేతనం, అర్హతలు, వయో పరిమితి తదితర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

సర్కిళ్ల వారీగా నోటిఫై చేసిన పోస్టుల వివరాలివే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని