ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి బీసీ స్టడీ సర్కిల్‌లో చదవాలనుకుంటున్నాను. అయిదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Published : 26 Jun 2022 01:31 IST

* నేను గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి బీసీ స్టడీ సర్కిల్‌లో చదవాలనుకుంటున్నాను. అయిదు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మా నాన్న రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పెన్షన్‌ సంవత్సరానికి  రూ.2,28,000. నేను ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని ఎక్కడ పొందవచ్చు?   -అనుపమ

జ: మీ నాన్నగారి పెన్షన్‌ వివరాలను సంబంధిత  తహసీల్దారుకు చూపించి ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.


* నేను ఏఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాను. బీటెక్‌ చివరి సంవత్సరం ఫలితాలు ఒక నెలలో వస్తాయి. ఉద్యోగ దరఖాస్తుకి ఫలితాలు వస్తే సరిపోతుందా లేదా మెమో కూడా కావాలా?  - చందన

జ: దరఖాస్తు సమయానికి ఫలితాలు వచ్చి ఉంటే సరిపోతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సమయానికి మెమో తప్పనిసరిగా ఉండాలి.


* బోనఫైడ్‌ లేని తరగతుల సంవత్సరాలకు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వమని ఎంఆర్‌ఓ కార్యాలయంలో  అడిగితే అలాంటి ప్రొఫార్మా ఏదీ లేదంటున్నారు. కావాలంటే 15 లేదా 20 సంవత్సరాలకు నివాస ధ్రువీకరణ పత్రం ఇస్తామంటున్నారు. అవసరమైన కాలానికి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ ఎలా తీసుకోవాలి? - సందీపన్‌

జ:  2018 జీఓ 124ను తహసీల్దారుకు చూపిం చండి. సంబంధిత కాలానికి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను పొందే అవకాశాన్ని ఆ జీఓ కల్పిస్తోంది.


మీ సందేహాలను పోస్ట్‌ చేయడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.
help@eenadupratibha.net

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని