మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ తర్వాత?

బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) చేశాను. ఎమ్మెస్సీ కాకుండా.. ఇతర కోర్సులు ఏమైనా చదివితే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 10 Jul 2024 00:36 IST

బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) చేశాను. ఎమ్మెస్సీ కాకుండా.. ఇతర కోర్సులు ఏమైనా చదివితే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

దేవీ దుర్గ

సాధారణంగా బీఎస్సీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ ప్రోగ్రాం పూర్తిచేసినవారికి మెడికల్‌ టెక్నాలజిస్ట్, లేబొరేటరీ సూపర్‌వైజర్, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ స్పెషలిస్ట్, బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నాలజిస్ట్, రిసెర్చ్‌ అసిస్టెంట్, క్వాలిటీ కంట్రోల్‌ స్పెషలిస్ట్, హాస్పిటల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్, హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేటర్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి వస్తే.. గవర్నమెంట్‌ మెడికల్‌ లేబొరేటరీ టెక్నీషియన్, పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీ టెక్నీషియన్, క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ లాంటి కొలువులు ఉన్నాయి. ఉన్నతవిద్య అభ్యసించాలనుకొంటే బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ మైక్రో బయాలజీ, ఫిజిషియన్‌ అసిస్టెంట్, జెనెటిక్‌ కౌన్సెలింగ్, ఎపిడిమోలజీ, హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి వాటిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ కోర్సులు చేయొచ్చు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ క్లినికల్‌ పాథాలజీ లాంటి సంస్థల నుంచి ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ కూడా పొందే ప్రయత్నం చేయొచ్చు. ఆసక్తి ఉంటే- ఎంబీఏలో హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్‌లో పీజీ చేయొచ్చు. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో ఉన్నతవిద్య అభ్యసించిన వారికి హెల్త్‌కేర్‌ పరిశ్రమలో, బయో లేబొరేటరీ, ఫార్మా, బయోటెక్‌ కంపెనీల్లో, ఫెర్టిలిటీ రిసెర్చ్‌ క్లినిక్కుల్లో, ఫోరెన్సిక్‌ రిసెర్చ్‌ ల్యాబుల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని