Bank Jobs: నేడే లాస్ట్.. ఎస్‌బీఐలో ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేశారా?
SBI Job Recrutiment: ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీ దరఖాస్తులకు నేటితో గడువు ముగుస్తోంది. స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పూర్తవుతోంది. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులకు ఈ ఒక్క రోజే మిగిలి ఉంది. బ్యాంకు శాఖల్లోని పలు విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(SBI specialist ca ఉద్యోగాలను రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎస్‌బీఐ ఏప్రిల్ 29నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోన్న విషయం తెలిసిందే. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష జూన్‌లో జరిగే అవకాశం ఉంది. పరీక్షకు పది రోజుల ముందు కాల్ లెటర్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. బీటెక్/ఎంటెక్ అర్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 182.. ఒప్పంద ప్రాతిపదికన 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..
- అభ్యర్థులు బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్సు/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఐటీ/సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. లేదంటే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ లేదా ఎంటెక్/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఈసీఈ) అయినా పూర్తి చేసి ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులు పోస్టుల ఖాళీలను బట్టి నవీ ముంబయి, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ పోస్టులను ఎంఎంజీఎస్-III, ఎంఎంసీఎస్-II, జేఎంజీఎస్-1 గ్రేడ్‌ల వారీగా విభజించి వయో పరిమితి విధించారు.
- కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికయ్యే అభ్యర్థులు మూడేళ్ల పాటు విధిగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంఎంసీఎస్-II, జేఎంజీఎస్-1 గ్రేడ్ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.
- ఎంఎంజీఎస్ III పోస్టులకు మాత్రం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు.
- తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోస్టుల్లో నియమితులయ్యే ఉద్యోగులకు ఇచ్చే వేతనం, పరీక్ష విధానం తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ