ఈ 5 పనులు చేస్తే టాప్ కంపెనీల నుంచి కాల్స్ పక్కా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెప్తున్న టిప్స్ ఇవే..!
పేరొందిన కంపెనీల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటిస్తే అలాంటి కంపెనీల నుంచి కాల్స్ పక్కా వస్తాయని చెప్తున్నారు గూగుల్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీక్షా పాండే.
ఇంటర్నెట్ డెస్క్: పేరొందిన పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం (Job) చేయాలన్నది చాలా మంది కల. ఒకసారి ఉద్యోగం వచ్చాక నలుగురితో చెప్పడానికీ బాగుంటుంది. ఇదంతా ఊహించుకోవడానికి బాగానే ఉన్నా.. అంత పెద్ద కంపెనీ నుంచి పిలుపు అందుకోవడం అంత సులువు కాదు. చాలా మంది విశ్వప్రయత్నాలు చేసినా అదృష్టం దక్కేది కొందరికే. అయితే, తాను పాటించిన చిట్కాలు పాటిస్తే మాత్రం టాప్ కంపెనీల ఇంటర్వ్యూ కాల్స్ రావడం పక్కా అని చెప్తోంది దీక్షా పాండే. ప్రస్తుతం గూగుల్‌లో (Google) పనిచేస్తున్న లఖ్‌నవూకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తాజాగా లింక్డిన్‌లో (linkedin) కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈ టిప్స్ పాటించడం వల్ల తాను మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి కాల్స్ అందుకున్నానని చెప్పారు. ఆఖరికి గూగుల్‌లో కొలువు సంపాదించానని వివరించారు.
కెరీర్ పేజీలకు సబ్‌స్క్రైబ్ అవ్వండి..
పెద్ద పెద్ద కంపెనీల్లో కొలువు సాధించాలంటే ముందు ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయో లేదో తెలియాలి. అందుకోసం వందకు పైగా కంపెనీల కెరీర్ పేజీలకు తాను సబ్‌స్క్రైబ్ అయినట్లు దీక్షా పాండే తెలిపారు. ఎప్పుడైనా ఏదైనా కొత్త ఓపెనింగ్ వచ్చినప్పుడు తనకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందేదని తన పోస్టులో వివరించారు. దీనివల్ల ప్రతి రోజూ గంటలకొద్దీ కొత్తగా ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయా.. అని చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు.
హైరింగ్ కాంటెస్ట్‌ల్లో..
అనేక కంపెనీలు హైరింగ్ కాంటెస్టులు నిర్వహిస్తుంటాయి. దాదాపు తాను అన్ని ప్రముఖ కంపెనీలు నిర్వహించిన నియామక ప్రకియల్లోనూ పాల్గొన్నట్లు పాండే తెలిపారు. ఇవే కాకుండా హ్యాకర్ ఎర్త్, డీ2సీ వంటి సైట్లు ఇలాంటివి నిర్వహిస్తుంటాయని తెలిపారు.
హ్యాకథాన్లు ఓ మంచి అవకాశం
హ్యాకథాన్లలో పాల్గొనడం కూడా తనకు లాభించిందని తన పోస్టులో పాండే చెప్పారు. మైక్రోసాఫ్ట్ నిర్వహించిన మైక్రోసాఫ్ట్ ఫిక్సాథాన్‌లో తాను పాల్గొన్నానని.. ఓ విధంగా మైక్రోసాఫ్ట్ నుంచి కాల్ రావడానికి ఇది దోహదపడిందని వివరించారు.
రెజ్యూమె మార్చాలి
చాలా మంది ఉద్యోగార్థులు రెజ్యూమెను సిద్ధం చేసుకుంటారు. దాదాపు అన్ని కంపెనీలకూ అదే రెజ్యూమెను పంపిస్తూ ఉంటారు. తాను మాత్రం జాబ్ డిస్క్రిప్షన్‌కు అనుగుణంగా రెజ్యూమెలో మార్పులు చేశానని దీక్షా చెప్పారు. అలాగే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలకు అనుగుణంగా సంబంధిత కీవర్డ్స్‌ను హైలైట్ చేయడం ద్వారా హైరింగ్ మేనేజర్ దృష్టిలో పడడం సాధ్యపడుతుందని చెప్పారు.
పట్టు విడవకండి..
ఉద్యోగం కోసం యత్నించే సమయంలో వందలాది రిజెక్షన్ మెయిల్స్ అందుకున్నానని పాండే తెలిపారు. అలాగని కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విషయంలో తాను ఏమాత్రం వెనకడుగు వేయలేదన్నారు. కంపెనీల నుంచి స్పందన రానంత మాత్రన నిరుత్సాహ పడకూడదని చెప్పారు. ‘‘కొత్తగా దరఖాస్తు చేస్తూ వెళుతుంటే.. నీదైన రోజు తగిన ఉద్యోగం నిన్ను వరిస్తుంది’’ అని పాండే తన పోస్టులో రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చేసిన ఈ పోస్టును వందలాది మంది లైక్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’