SSC Exams Schedule: పలు ఉద్యోగాలకు SSC రాత పరీక్ష తేదీలు ఖరారు

SSC Exam schedule: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌సీ ఖరారు చేసింది.

Published : 27 Apr 2023 22:28 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. భారీ సంఖ్యలో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. సీహెచ్‌ఎస్‌ఎల్‌ (CHSL) పరీక్షలను ఆగస్టు 2 నుంచి 22 వరకు, ఎంటీఎస్‌(నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ అండ్‌ హవల్దార్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 1 నుంచి 29 వరకు, ఎస్సై (దిల్లీ పోలీస్) పరీక్షలను అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని