Results: తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహిచిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను మంత్రి గంగుల కమలాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పి.జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి, 108 మార్కులతో తొలి ర్యాంక్ కొట్టేసింది. సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత (107 మార్కులు), ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ.అర్చన (109 మార్కులు) తొలి స్థానంలో నిలిచారు. https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు గురుకుల కళాశాలల్లో చేరేందుకు గడువు విధించినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు