TSLPRB: కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

Telangana police Constable: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను పొందండి ఇలా..

Published : 24 Apr 2023 19:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల(Constable posts) భర్తీకి తుది రాత పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 30న జరిగే ఈ పరీక్ష హాల్‌ టికెట్ల(Hall tickets)ను అభ్యర్థులు ఏప్రిల్ 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (TSLPRB) తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఐటీ అండ్ సీవో) తుది పరీక్షలు ఏప్రిల్ 30న జరగనున్నాయి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10.00 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 1.00 వరకు పరీక్ష జరగనుండగా.. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే support@tslprb.inకు ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని tslprb సూచించింది.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు