Telangana TET: తెలంగాణ టెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 12 Jun 2024 19:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1లో 67.13 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 85,996 మంది అభ్యర్థుల్లో 57,725 మంది క్వాలిఫై అయ్యారు. టెట్‌ పేపర్‌-2లో 34.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1,50,491 మందిలో అర్హత సాధించగా.. 51,443 మంది ఉత్తీర్ణత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్‌-1లో 30.24 శాతం, పేపర్‌-2లో 18.88 అర్హత శాతం పెరిగింది. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

మరోవైపు టెట్‌ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అర్హత సాధించని వారు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత సాధించిన వారు డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. ఎన్నికల కోడ్‌ వల్ల టెట్‌-2024 దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించలేకపోయింది. ఈ నేపథ్యంలో తదుపరి టెట్‌, డీఎస్సీ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని