Telangana Dsc: షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ.. ఎలాంటి మార్పు లేదు

తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

Published : 08 Jul 2024 19:22 IST

హైదరాబాద్‌: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రకటన వెలువడటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని