TGPSC Exam Schedule: సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

తెలంగాణలోని సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది.

Published : 16 Jun 2024 15:40 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల పూర్తి కావడంతో ఉద్యోగ నియామకాల్లో టీజీపీఎస్సీ (TGPSC) దూకుడును పెంచింది. ఇటీవల గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పరీక్షలను జూన్‌ 24 నుంచి 29వరకు నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ప్రారంభం కావడానికి మూడు రోజుల ముందు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. 

₹లక్షన్నర జీతం.. సెబీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?

ఇక పోస్టుల విషయానికి వస్తే.. అత్యధికంగా ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు ఇలా...

  • గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్‌-1 - 5; గ్రేడ్‌-2 - 106
  • ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు  గ్రేడ్‌-2 (మహిళ) - 70; గ్రేడ్‌-2 (పురుషులు) - 228
  • బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్‌-2 - 140
  • దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్‌ గ్రేడ్‌ -1 - 5; వార్డెన్‌ గ్రేడ్‌-2 - 3
  • దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్‌ గ్రేడ్‌-1 - 3; మాట్రన్‌ గ్రేడ్‌-2 - 2
  • చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు - 19

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని