TGPSC: తెలంగాణ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 12 Jun 2024 19:30 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ తాజాగా మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్‌- 1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో డిస్క్రిప్టివ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పరీక్ష వివరాలతో టైం టేబుల్‌ను విడుదల చేసింది.

జూన్‌ 9న రాష్ట్రవ్యాప్తంగా 895 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు 4.03 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలోనే ప్రిలిమ్స్‌ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని