TGPSC: తెలంగాణ గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ‘కీ’పై ఈనెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 

Updated : 13 Jun 2024 09:27 IST

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’ (Group 1 Prelims key) విడుదలైంది. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఈ లింక్‌ను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్‌ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్‌ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది.

ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి

అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను (ఉదా: రచయిత పేరు/ఎడిషన్‌/పేజీ నంబర్‌/పబ్లిషర్స్‌ పేరు/వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వంటివి) అప్‌లోడ్‌ చేయవచ్చని కమిషన్‌ సూచించింది. ఈమెయిల్స్‌, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయని తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని