TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ‘కీ’ విడుదల

TS EAMCET 2023 Key: తెలంగాణ ఎంసెట్‌ ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’లో అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 17 రాత్రి 8గంటల వరకు తెలపవచ్చు. ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి..

Updated : 15 May 2023 20:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ (TS EAMCET 2023) ప్రాథమిక కీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం రాత్రి 8గంటలకు EAMCET 2023 (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌) పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు ఆరు విడతల్లో నిర్వహించిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్‌ పత్రాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై ఈ నెల 17 రాత్రి 8గంటల వరకు అభ్యంతరాలను పంపొచ్చని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,95,275మంది(94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయం వెల్లడించింది.

ఎంసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ మాస్టర్‌ ప్రశ్నాపత్రాలు

రెస్పాన్స్‌ షీట్‌ ఇదే..

అభ్యంతరాలు తెలిపేందుకు ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు