TS EAMCET: ఎంసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) హాల్‌టికెట్లు (Hall tickets) అందుబాటులోకి వచ్చాయి. షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యామండలి వీటిని ఉంచింది.

Updated : 30 Apr 2023 11:22 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) హాల్‌టికెట్లు (Hall tickets) అందుబాటులోకి వచ్చాయి. షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యామండలి వీటిని ఉంచింది. విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 10 నుంచి 15 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్‌, మెడికల్‌.. 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 10నే గడువు ముగియగా.. మే 2 వరకు అపరాధ రుసుముతో అవకాశం ఉంది. ఎంసెట్‌కు ప్రతి 100 మందిలో ముగ్గురు ఆలస్య రుసుంతోనే దరఖాస్తు చేసుకున్నారు. రూ.250 నుంచి రూ.5 వేల వరకు అదనంగా చెల్లిస్తుండటం గమనార్హం. రూ.5 వేలతో ఇప్పటివరకు 59 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం వరకు మొత్తం 8,394 మంది ఆలస్య రుసుంతో పరీక్ష రాయడానికి ముందుకొచ్చారు. శుక్రవారానికి మొత్తం 3,19,947 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్‌ కోకన్వీనర్‌ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తెలిపారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని