TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఎప్పుడంటే..?

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

Updated : 23 May 2023 16:34 IST

హైదరాబాద్‌: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల(TS EAMCET 2023 Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 25న ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.  జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని  గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.డీన్‌ కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్ష; మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షకు దాదాపు లక్ష మందికి విద్యార్థులు పైగా హాజరయ్యారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు