TS EAMCET 2023: రేపే టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు.. సమయంలో మార్పు!

TS EAMCET 2023 Results: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. రేపు ఉదయం 9.30గంటలకే విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated : 24 May 2023 21:06 IST

హైదరాబాద్‌: విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు(TS EAMCET 2023 Results) విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరీక్ష ఫలితాలను ఈ నెల 25న(గురువారం) విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు.. సమయంలో స్వల్ప మార్పులు చేశారు. తొలుత నిర్ణయించిన సమయం కన్నా ముందే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ముందుగా ప్రకటించినట్టు గురువారం ఉదయం 11గంటలకు బదులుగా.. రేపు ఉదయం 9.30గంటలకే ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ డా.బి.డీన్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగిన పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఫలితాలను www.eenadu.net  వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని