TS Exam 2022: కరెంట్‌ అఫైర్స్‌

నేరాలకు పాల్పడిన దోషులు, నిందితుల నుంచి భౌతిక, జీవ నమూనాలు సేకరించే అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం తెచ్చిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏప్రిల్‌ 19న ఆమోదించారు.

Updated : 21 Apr 2022 03:41 IST

క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నేరాలకు పాల్పడిన దోషులు, నిందితుల నుంచి భౌతిక, జీవ నమూనాలు సేకరించే అధికారాన్ని కల్పిస్తూ కేంద్రం తెచ్చిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏప్రిల్‌ 19న ఆమోదించారు. ఏప్రిల్‌ 4న లోక్‌సభ, 6న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. 1920లో తెచ్చిన ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో ఈచట్టం అమల్లోకి రానుంది.


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) సీనియర్‌ నాయకురాలు కొండపల్లి దుర్గాదేవి (89) మరణించారు. ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు.


ష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద ముఠా సభ్యుడు షేక్‌ సాజద్‌ అలియాస్‌ సజ్జద్‌ గుల్‌, ‘అల్‌ బద్ర్‌’ గ్రూప్‌నకు చెందిన అర్జుమండ్‌ గుల్జార్‌ దార్‌ అలియాస్‌ హమ్జా బుర్హాన్‌లను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా గుర్తించింది.


సియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు గ్రీకో రోమన్‌ రెజ్లర్లు సునీల్‌ కుమార్‌, అర్జున్‌ హళకుర్కి, నీరజ్‌ కాంస్య పతకాలు సాధించారు. 87 కేజీలలో సునీల్‌ 5-0తో బత్బయార్‌ లుత్బయార్‌ (మంగోలియా)పై, 55 కేజీలలో అర్జున్‌ 10-7తో ముంఖ్‌ ఎర్డెన్‌ (మంగోలియా)పై, 63 కేజీలలో నీరజ్‌ 7-4తో బఖ్రమోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచారు.


ఏడాది భారత్‌ వృద్ధిరేటు 8.2 శాతంగా నమోదు కావచ్చని ఐఎమ్‌ఎఫ్‌ అంచనా వేసింది. గత అంచనా 9% కంటే ఇది    0.8% తక్కువ. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద దేశంగా భారత్‌ కొనసాగనుంది.


లింపిక్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత జస్టిన్‌ గాట్లిన్‌ ప్రపంచ 10కె బెంగళూరు మారథాన్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ అమెరికా స్టార్‌ స్ప్రింటర్‌ భారత్‌కు రాబోతుండటం ఇదే తొలిసారి.


పాకిస్థాన్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. 34 మంది సభ్యులున్న కేబినెట్‌లో అనుభవానికి, కొత్త వారికి ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ సమప్రాధాన్యం ఇచ్చారు. కనీసం 20 మంది తొలిసారిగా మంత్రులయ్యారు.


దేశంలోనే తొలి పోర్టబుల్‌ సౌర ఫలకల వ్యవస్థను గాంధీనగర్‌లోని స్వామినారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించారు. జర్మనీకి చెందిన డాయిష్‌ జెసెల్‌షాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసామెనార్బిట్‌ (జీఐజడ్‌) సహకారంతో 10 పీవీ పోర్ట్‌ వ్యవస్థలను ఇందులో నెలకొల్పినట్లు సంస్థ తెలిపింది.


తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) నుంచి నిర్వాసితులుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చి 38 ఏళ్లుగా సంచార జీవులుగా ఉన్న 63 హిందూ బెంగాలీ కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పునరావాస అంగీకార పత్రాలు పంపిణీ చేశారు.


భారతీయ మూలాలు ఉన్న అమెరికా నౌకాదళాధికారి శాంతి సేఠీ, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్యతలు చేపట్టారు. సేఠీ 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెస్ట్రాయర్‌ నౌక డికోడర్‌ కమాండరుగా వ్యవహరించారు. ఒక అమెరికన్‌ యుద్ధనౌక అధిపతిగా భారత్‌ను సందర్శించిన తొలి మహిళా కమాండర్‌ కూడా ఈవిడే.


తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఏడాది పూర్తయిన సందర్భంగా తమిళిసై తన ప్రస్థానం గురించి రాసిన వన్‌ అమాంగ్‌ అండ్‌ అమాగస్ట్‌ పీపుల్‌, ఏ ఇయర్‌ ఆఫ్‌ పాజిటివిటీ పుస్తకాలను చెన్నైలో ఆవిష్కరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని