TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడంటే?

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఈ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated : 08 May 2023 16:28 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్‌ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాల(TS Inter Results)ను మే 9న (మంగళవారం) విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను రేపు ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు www.eenadu.net, tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు