TS Inter: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువును పొడిగిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

Updated : 16 May 2023 21:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు పొడిగించింది. నేటితో ఈ గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు మే 19వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అలాగే, రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ గడువును సైతం బుధవారం (ఈ నెల 17)వరకు పొడిగించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూన్‌ 4 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

అంతకుముందు, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంటర్‌ బోర్డును కోరింది. ప్రభుత్వ కళాశాలల్లో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇంకా ఫీజు చెల్లించలేదని.. ఈ నేపథ్యంలో గడువు పెంచి వారికి నష్టం జరగకుండా చూడాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని